Dwayne Bravo: లీగ్‌లోనే భారీ సిక్స్‌.. బాదిన సీఎస్కే కోచ్.. బాల్ ఎలా వెళ్లిందో తెలుసా? (వీడియో)

Update: 2023-07-17 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వేదికగా జరుగుతున్న మినీ ఐపీఎల్ అలియాస్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో డ్వేన్ బ్రావో దుమ్మురేపుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డ్వేన్ బ్రావో.. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ సిక్సర్‌గా నిలిచిపోయింది.

ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ పేసర్, సౌతాఫ్రికా స్టార్ అన్రిచ్ నోర్జ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను బ్రావో తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్‌గా మలిచాడు. బ్రావో ధాటికి బంతి 106 మీటర్ల దూరంలో మైదానం బయటపడింది. టీఎస్‌కే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని నోర్జ్ బౌన్సర్‌గా వేయగా.. బ్రావో పుల్ షాట్‌తో లాంగాన్ దిశగా సిక్సర్ బాదాడు. ఈ భారీ సిక్సర్‌‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


Similar News