Duleep Trophy Final: చెలరేగిన పృథ్వీ షా..

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది.

Update: 2023-07-13 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ కోసం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్.. ప్రియాంక్ పాంచల్ కెప్టెన్సీలోని వెస్ట్ జోన్ హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి 39 ఓవర్లలో 5 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసింది. పృథ్వీ షా (101 బంతుల్లో 9 ఫోర్లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

కెప్టెన్ ప్రియాంక్ పాంచల్(11), కీపర్ హర్విక్ దేశాయ్(21), సూర్యకుమార్ యాదవ్(8), సర్ఫరాజ్ ఖాన్(0) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో చతేశ్వర్ పుజారా(8 బ్యాటంగ్), అతిత్ షేత్(4 బ్యాటింగ్) ఉన్నారు. వెస్ట్ జోన్ ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్‌ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్‌ జోన్‌ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. వెస్ట్‌ జోన్‌ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. వెస్ట్ జోన్.. పుజారాపైనే ఆశలు పెట్టుకుంది. అతను రాణిస్తేనే మ్యాచ్‌లో నిలవనుంది. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్ కావేరప్ప(3/40) మూడు వికెట్లు తీయగా.. వాసుకి కౌశిక్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో వికెట్ తీశారు.


Similar News