MS Dhoni : ఓటు హక్కు వినియోగించుకున్న ధోని దంపతులు

భారత క్రికెట్‌ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain)‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2024-11-13 16:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్‌ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain)‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య సాక్షి (Sakshi) తో కలిసి రాంచి (Ranchi) లోని ఓ పోలింగ్‌ బూత్‌కు వచ్చిన ధోని ఓటు వేశారు. దంపతులిద్దరూ ఓటు వేసి బయటికి వచ్చిన అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మహేంద్రసింగ్‌ ధోనీ దంపతులు రాంచిలో ఓటు వేసేందుకు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది వారికి రక్షణ కవచంలా నిలిచి పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు.

కాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం మొద‌టి విడ‌త‌లో 43 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 వరకు 64.86 శాతం ఓటింగ్ న‌మోదైంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్‌ జరగనుంది. 

Tags:    

Similar News