చరిత్రను తిరగరాసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

దుబాయ్ వేదికగా జరుగుతున్న మెగా వేలం( IPL mega auction)లో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు.

Update: 2024-11-24 11:26 GMT

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతున్న మెగా వేలం( IPL mega auction)లో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్(RTM) చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇదే ఐపీఎల్(IPL) చరిత్రలో ఓ ప్లేయర్ కు వెచ్చించిన అత్యధిక ధర గా నిలిచింది. కాగా ఈ రికార్డు బ్రేకింగ్ ధరను కొద్ది సేపటికే భారత మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh panth) తిరగరాశారు. రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలం లోకి వచ్చిన పంత్ ను కొనేందుకు మొదట ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య పోటీ జరగ్గా.. 10 కోట్ల మార్కును దాటిన తర్వాత.. ఆర్సీబీ తప్పుకుంది.

అనంతరం రంగంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు.. పంత్ ను కోనేందుకు దాదాపు 20.50 కోట్ల వరకు వేలం పాడింది. అనంతరం పంజాబ్ జట్టు 20.75 కోట్లకు వేలం పాడగా.. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi campitals) జట్టు ఆర్టీఎమ్(RTM) చేసుకునేందు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన లక్నో జట్టు పంత్ కు ఏకంగా.. 27 కోట్లకు కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడు పోయాడు. దీంతో ఐపీఎల్(IPL) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కొద్ది క్షణాల క్రితం నిలిచిన శ్రేయస్ అయ్యర్ ను బీట్ చేసిన పంత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. మొత్తానికి రూ. 27 కోట్లకు రిషబ్ పంత్((Rishabh panth)) ను లక్నో(LSG) జట్టు సొంతం చేసుకుంది.

Tags:    

Similar News