Champions Trophy-2025: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత స్టార్ ప్లేయర్‌కు గాయం

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) చరమాంకానికి చేరుకుంది.

Update: 2025-03-08 10:55 GMT
Champions Trophy-2025: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత స్టార్ ప్లేయర్‌కు గాయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) చరమాంకానికి చేరుకుంది. రేపు దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా టీమిండియా (Team India), న్యూజిలాండ్‌ (New Zealand)తో ఫైనల్‌ (Final)లో తలపడబోతోంది. ట్రోఫీని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఇరు జట్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నాయి. ఓ వైపు పటిష్టమైన బ్యాటింగ్‌, పేస్ ఎటాక్‌తో న్యూజిలాండ్ జట్టు దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే, కివీస్‌ను నిలువరించేందుకు టీమిండియా (Team India) స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.

ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫైనల్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. పేసర్ వేసిన బంతి నేరుగా కింగ్ కోహ్లీ మోకాలికి బలంగా తగిలి గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేశాడని, అనంతరం గాయంపై ఫిజియో స్ర్పే కొట్టి, బ్యాండేడ్ వేశారని జట్టు వర్గాలు తెలిపాయి. కానీ, కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నాడని కోచింగ్ స్టాఫ్ పేర్కొంది. అయితే, విరాట్‌కు గాయం అయిందనే విషయం బయటకు రావడంతో రేపటి మ్యాచ్‌లో కోహ్లీ తుది జట్టులో ఉంటాడా లేదా అనే ఆందోళన టీమిండియా ఫాన్స్ నెలకొంది.

 

Tags:    

Similar News