Breaking: మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో చైనీస్ బ్యాడ్మింటన్ ఆటగాడు మృతి.. నెట్టింట వీడియో వైరల్

ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటిన్ టోర్నీ తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2024-07-02 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటిన్ టోర్నీ తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా మ్యాచ్ ఆడేందుకు కోర్టులోకి వచ్చిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజీ (17) ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. అలా చేసేపు కోర్టులో గిలాగిలాకొట్టుకుంటూ పడిపోయిన జాంగ్‌ జిజీని పరిశీలించిన ఫిజియోలు గుండెపోటు మరణించినట్లుగా ధృవీకరించారు. అయితే, అతడు పడిపోయిన వెంటనే అక్కడున్న వారు సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఉంటే అతడు బతికేవాడేమోనని సోషల్ మీడియాలో వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. 

Similar News