టీ20 ట్రోఫీతో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు

జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో గెలిచి ఛాంపియన్ గా నిలిచిన భారత్ భారీ తుఫాను కారణంగా బార్బొడాస్‌లోనే చిక్కుకుని పోయింది.

Update: 2024-07-04 01:48 GMT

దిశ, వెబ్ డెస్క్: జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో గెలిచి ఛాంపియన్ గా నిలిచిన భారత్ భారీ తుఫాను కారణంగా బార్బొడాస్‌లోనే చిక్కుకుని పోయింది.దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్న టీం ఇండియా వాతావరణం కాస్త కుదుట పడటం తో ప్రత్యేక విమానంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ చేరకుంది. 13 సంవత్సరాల తర్వాత టీ20 ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన జట్టును స్వాగతించేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు టీం ఇండియా భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో టీ20 ట్రోఫితో పాల్గొననున్నారు. ఇందుకోసం బీసీసీఐ తో పాటు, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబై ప్రధాన రహదారుల్లో భారత జట్టుతో ఊరేగింపు భారీ ఎత్తున కొనసాగనుంది.


Similar News