దేవుడికి కూడా సొంత ప్లాన్ ఉంటుంది : రిషబ్ పంత్

దిశ,స్పోర్ట్స్ : టీ20 ప్రపంచ కప్ -2024 ఫైనల్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై 7పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే.

Update: 2024-07-03 18:30 GMT

దిశ,స్పోర్ట్స్ : టీ20 ప్రపంచ కప్ -2024 ఫైనల్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై 7పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా క్రికెటర్లు తమ జీవితంలో గడచిన గడ్డుపరిస్థితులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా రిషబ్ పంత్ విన్నింగ్ మెడల్‌తో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఎమోషనల్ పోస్టు పెట్టాడు.‘ఈ క్షణం ఎంతో గొప్పగా, గర్వంగా, అనందంగా ఉంది. ఆ దేవుడికి కూడా తనకంటూ సొంత ప్లాన్ ఉంటుంది. ఈ మెడల్ నాకు ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు.కాగా, ఘోరమైన ప్రమాదాన్ని దాటి వచ్చిన పంత్..ఈ టోర్నీలో 8 మ్యాచుల్లో 171 పరుగులు చేయడంతో పాటు అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Similar News