Euro Cup 2024 : యూరో కప్‌లో సెమీస్‌కు స్పెయిన్

యూరో కప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో చాంపియన్ జర్మనీని ఓడించి టాప్-4 జట్లలో నిలిచింది.

Update: 2024-07-05 19:29 GMT

దిశ, స్పోర్ట్స్ : యూరో కప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో చాంపియన్ జర్మనీని ఓడించి టాప్-4 జట్లలో నిలిచింది. శుక్రవారం చివరి వరకు రసవత్తరంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌లో స్పెయిన్ 2-1 తేడాతో జర్మనీపై విజయం సాధించింది. మెరినో ఆఖర్లో గోల్ చేసి స్పెయిన్‌ను విజయతీరాలకు చేర్చాడు. మొదటి నుంచి ఇరు జట్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించాయి. అలాగే, పరస్పరం గోల్‌పోస్టులపై దాడి చేశాయి. అయితే, ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదవ్వలేదు. సెకండాఫ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు దూకుడు పెంచారు. ఈ క్రమంలో 51వ నిమిషంలో స్పెయిన్ తరపున డాని ఓల్మో తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత 89వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విర్ట్జ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో అదనపు సమయం కేటాయించారు. 119వ నిమిషంలో మెరినో గోల్ చేయడంతో స్పెయిన్ విజయం లాంఛనమైంది. 


Similar News