హార్దిక్ గత ఆరు నెలలు అత్యంత కష్టతరంగా గడిపాడు: కృనాల్ పాండ్యా

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ జట్టు గెలవడంలో హర్దీప్ పాండ్యా అత్యంత కీలక పాత్ర పోషించాడు.

Update: 2024-07-06 10:10 GMT

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ జట్టు గెలవడంలో హర్దీప్ పాండ్యా అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఒకానొక దశలో ఓడిపొతుందనుకున్న సమయంలో క్లాసిన్, మిల్లర్ లాంటీ డేంజరస్ బ్యాటర్లను అవుట్ చేసి ఇండియాకు టీ20 ప్రపంచ కప్ అందించాడు. జూన్ 29న ప్రపంచ కప్ గెలిచిన భారత్ తుఫాను కారణంగా నాలుగు రోజులపాటు బార్బడోస్‌లోనే చిక్కుకుని పోయింది. గురువారం ఉదయం భారత్ చేరకున్న టీం ఇండియా ముంబైలో భారీ ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ అభిమానుల్ దాదాపు 10 నిమిషాలపాటు.. పాండ్య.. పాండ్యా అంటూ నినాదాలు చేశారు. దీంతో అతను గత ఐపీఎల్ సమయంలో ఎక్కడైతే అవమానాలు ఎదుర్కున్నాడో అక్కడే ఘనంగా స్వాగతించబడ్డాడు.

ఇదిలా ఉంటే హర్ధిక్ పాండ్యా గత ఆరు నెలల నుంచి క్లిష్టతరమైన రోజులను గడిపానని పలుమార్లు మీడియాతో చెప్పుకొచ్చాడు. తాజాగా అతని అన్న కృనాల్ పాండ్యా కూడా.. ఆరు నెలలు పాండ్యా గడిపిన క్లిష్టతరమైన జీవితం గురించి చెప్పుకొచ్చారు. విజయోత్సవం సందర్భంగా స్పందిస్తూ.. గత ఆరు నెలల్లో హార్దిక్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. గాయం కారణంగా ODI ప్రపంచ కప్ 2023 నుండి నిష్క్రమించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ముంబై ఇండియన్స్ (MI)ని టోర్నమెంట్‌లో నాకౌట్ దశకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. అయినప్పటికి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

ప్రపంచకప్ లో 8 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్స్‌లలో పాల్గొన్న హార్దిక్ బ్యాటింగ్‌లో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అలాగే అతను బంతితో కూడా అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించాడు. టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతను 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన తర్వాత టీమ్ ఇండియా రెండో T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడని రాసుకొచ్చాడు.


Similar News