ICC ర్యాంకింగ్స్‌లో వరల్డ్ వన్‌గా హార్దిక్ పాండ్యా!

దిశ,స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ పొజిషన్ సాధించాడు.

Update: 2024-07-03 18:49 GMT

దిశ,స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ పొజిషన్ సాధించాడు. వరల్డ్ కప్ లో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌తో అదరగొట్టిన పాండ్యా.. 2 స్థానాలు మెరుగుపరుచుకుని శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ (222 పాయింట్స్)తో కలిసి హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో ఆల్ రౌండర్ల కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఇక పాండ్యా తర్వాతి స్థానంలో మార్కస్ స్టోనియిస్ (ఆస్ట్రేలియా), సికందర్ రాజా(జింబాబ్వే), షకిల్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఒక్కో స్థానం మెరుగుపర్చుకుని వరుసగా 3,4,5వ స్థానంలో నిలిచారు.

బౌలింగ్‌‌లో బుమ్రా, అర్షదీప్..

ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే..సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నాడు.భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో కొనసాగుతుండగా..కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12 స్థానంలో నిలవగా..అర్షదీప్ నాలుగు స్థానాలు మెరుగై 13వ స్థానంలో నిలిచాడు.


Similar News