భారత్‌-బంగ్లా తొలి పోరు.. టాస్ ఓడి ఒత్తిడిలో టీమిండియా?

రత్, బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు నుంచి టెస్ట్ సిరీస్ మొదలైంది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Update: 2024-09-19 04:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు (గురువారం) నుంచి టెస్ట్ సిరీస్ మొదలైంది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై తేమ కనిపిస్తోందని, ఇది బౌలర్లకు కలిసొచ్చే ఛాన్స్ ఉండడం వల్ల ఫీల్డింగ్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు బంగ్లా కెప్టెన్ నజీముల్ శాంటో తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా.. తాను టాస్ గెలిచి ఉంటే ఫీల్డింగ్ తీసుకునేవాడినని అన్నాడు.

అయితే ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టును వాళ్ల సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాపై గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే చాలా రోజుల నుంచి టెస్ట్ సిరీస్‌లను మిస్ అయిన రోహిత్ సేన మాత్రం ఈ సిరీస్ ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది.

బంగ్లాదేశ్ టీం:

షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమిన్ ఉల్ హక్, ముష్ఫికుర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, నాహిద్ రానా, తస్కిన్ అహ్మద్

ఇండియా టీం:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశశ్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్.


Similar News