అఫ్ఘనిస్తాన్‌‌పై బంగ్లా ఘన విజయం..

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకపడిన బంగ్లా జట్టు.. ఇవాళ జరిగిన మూడో వన్డేలో అఫ్ఘనిస్తాన్‌‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2023-07-11 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్:  మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-2తో వెనుకపడిన బంగ్లా జట్టు.. ఇవాళ జరిగిన మూడో వన్డేలో అఫ్ఘనిస్తాన్‌‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. 45.2 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేయగా, బంగ్లాదేశ్‌ 23.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మొదట బౌలింగ్‌లో షోరీఫుల్‌ ఇస్లాం (4), తస్కిన్‌ అహ్మద్‌ (2), తైజుల్‌ ఇస్లాం (2), షకీబ్‌ అల్‌ హసన్‌ (1), మెహిది హసన్‌ (1) చెలరేగగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో లిటన్‌ దాస్‌ (53 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో రాణించగా.. షకీబ్‌ (39), తౌహిద్‌ హ్రిదోయ్‌ (22 నాటౌట్‌) పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో అజ్మతుల్లా (56) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. షాహిది (22), నజీబుల్లా (10), ముజీబ్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు.


Similar News