Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ బాబర్ ఆజం కీలక ప్రకటన
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కెప్టెన్ బాబర్ ఆజం ఊహించని షాకిచ్చాడు.
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కెప్టెన్ బాబర్ ఆజం (Captain Babar Azam) ఊహించని షాకిచ్చాడు. టీ20 (T20 Format) ఫార్మాట్ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛదంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇప్పటికే తన నిర్ణయాన్ని పీసీబీ (PCB)కి తెలియజేసినట్లుగా బాబర్ పేర్కొన్నారు. అందుకు వారు కూడా సమ్మతించారని తెలిపారు. ఈ మేరకు అతడు తన నిర్ణయాన్ని ‘X’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. కెప్టెన్సీ చేయడం కష్టంతో కూడకున్నదని, ఆ బాధ్యత వల్ల తనపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని బాబర్ ఆజం (Babar Azam) అన్నారు. ప్రస్తుతానికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని తన బ్యాటింగ్ ఫామ్ (Batting Form), ఫుట్‌వర్క్ (Foot Work)పై దృష్టి పెట్టనున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్‌లో ‘దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
కెప్టెన్సీ నుంచి తప్పుకుని నా వ్యక్తిగత ఫామ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్సీ అనేది ఒక చక్కటి అనుభవం, కానీ, అది నాపై భారాన్ని పెంచింది. ముందుగా నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా. అదేవిధంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా. ఆ విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి’ అంటూ బాబర్ ఆజం ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా, పోయిన సంవత్సరం ఏప్రిల్‌లో బాబర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ (PCB) నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బాబర్ మొత్తం 85 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్ వ్యవహరించగా.. అందులో 48 విజయాలను జట్టుకు అందించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా బాబర్ ఘనత సాధించాడు.