KL Rahul : తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన అతియాశెట్టి-కేఎల్ రాహుల్
ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ జంట ఏడాదిన్నర క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఇన్స్టా గ్రామ్ వేదికగా జంట పోస్ట్ చేసింది. ‘అవర్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్ సూన్. 2025’ అంటూ రాసి ఉన్న అందమైన పోస్టర్ ను అతియా శెట్టి షేర్ చేసి కేఎల్ రాహుల్కు ట్యాగ్ చేసింది. పోస్ట్ కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీంతో బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, అతియా శెట్టి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు. పలు సినిమాల్లో హీరోయిన్గా ఆమె నటించారు.