Asian Games 2023: స్వర్ణం గెలిచిన పారుల్ చౌదరి..

Update: 2023-10-03 13:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 3000 మీటర్ల స్టీపెల్‌ఛేజ్ ఈవెంట్‌లో రజతం గెలిచిన పారుల్ చౌదరి, 5000 మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం గెలిచింది. మిక్స్‌డ్ 4X400 రిలే పోటీల్లో రజతం గెలిచిన విథ్యా రామ్‌రాజ్, మహిళల 400 మీటర్ల హర్డెల్స్‌లో కాంస్యం గెలిచింది. 39 ఏళ్ల కిందట ఏషియన్ గేమ్స్‌లో పతకం గెలిచిన పరుగుల రాణి పీటీ ఉషా రికార్డును సమం చేసింది కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ విథ్యా రామ్‌రాజ్. పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ గోషల్ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. అలాగే మరో భారత స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్ జోడి దీపికా పల్లికల్-హరీందర్ పాల్ సింగ్ కూడా సెమీస్ చేరుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.


Similar News