సౌత్‌ఆఫ్రికాకి షాకిచ్చిన ఐర్లాండ్.. క్రికెట్ చరిత్రలోనే రెండోసారి..

క్రికెట్‌లో ఐర్లాండ్ మరో సంచలనం నమోదు చేసింది. ఏకంగా సౌత్‌ఆఫ్రికాను చిత్తుగా ఓడించి రికార్డు విక్టరీ సాధించింది.

Update: 2024-10-08 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌లో ఐర్లాండ్ మరో సంచలనం నమోదు చేసింది. ఏకంగా సౌత్‌ఆఫ్రికాను చిత్తుగా ఓడించి రికార్డు విక్టరీ సాధించింది. తాజాగా అబుదాబి వేదికగా సౌత్ఆఫ్రికా, ఐర్లాండ్ మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఇందులో తొలి రెండు వన్డేల్లో సౌత్‌ఆఫ్రికా ఏకంగా 174, 139 పరుగుల తేడాతో అదిరిపోయే విజయాలు దక్కించుకుంది. కానీ మూడో వన్డేలో సీన్ రివర్స్ అయింది. షేక్ జాయెద్ స్టేడియం వేదికగా సోమవారం నాడు జరిగిన మూడో వన్డేలో ఐరిష్ జట్టు ప్రొటీస్‌ని ఏకంగా 69 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వన్డేల్లో సౌాత్‌ఆఫ్రికాపై ఐర్లాండ్‌కి ఇది రెండో విజయం మాత్రమే ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగా.. అందులో పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో సఫారీల ముందు 285 పరుగుల టార్గెట్‌ని నిలిపారు. అయితే చేజింగ్‌లో ప్రొటీస్ జట్టు పూర్తిగా తడబడింది. ఐరిష్ బౌలర్లు ఉమ్మడిగా రాణించడంతో వరుసగా వికెట్లు కోల్పోయారు. మిడిలార్డర్‌లో జేసన్ స్మిత్ (91) తప్ప ఇంకొక్కరు కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయారు.

ఇదిలా ఉంటే వన్డే సిరీస్ ముందు జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ సఫారీలకు ఓ మ్యాచ్‌లో ఐర్లాండ్ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సఫారీ జట్టు విజయం దక్కించుకోగా.. రెండో మ్యాచ్‌లో ఐరిష్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 1-1తో ముగించింది. 


Similar News