IND VS BAN : రెండో టీ20కి ముందు బంగ్లాకు భారీ షాక్.. సీనియర్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం

టీమిండియాతో రెండో టీ20కి ముందు బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

Update: 2024-10-08 12:27 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో రెండో టీ20కి ముందు బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌కు మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో టీ20 సిరీస్ తర్వాత టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ‘భారత్‌లో అడుగుపెట్టకముందే నిర్ణయం తీసుకున్నా. కెప్టెన్, కోచ్‌, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌కు ఈ విజయం తెలియజేశా. టీ20ల నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం. వన్డేలపై ఫోకస్ పెడతా.’ అని మహ్మదుల్లా తెలిపాడు. ఈ నెల 6న భారత్‌తో ఆడిన తొలి టీ20లో అతను ఆకట్టుకోలేకపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. 38 ఏళ్ల మహ్మదుల్లా 17 ఏళ్లపాటు బంగ్లా టీ20 జట్టుకు సేవలందించాడు. 2007లో అరంగేట్రం చేసిన అతను 139 టీ20ల్లో 2,395 పరుగులు, 40 వికెట్లు పడగొట్టాడు. ఇదే పర్యటనలో ఇటీవల స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News