ముగిసిన అజారుద్దీన్ సుదీర్ఘ ఈడీ విచారణ

హెచ్సీఏ(HCA) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్(Mahammad Ajaruddin) మీద ఈడీ(ED) విచారణ పూర్తయింది.

Update: 2024-10-08 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : హెచ్సీఏ(HCA) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్(Mahammad Ajaruddin) మీద ఈడీ(ED) విచారణ పూర్తయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై ఈడీ మంగళవారం ఉదయం నుండి 10 గంటలపాటు సుదీర్ఘంగా అజారుద్దీన్ ను విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'హెచ్సీఏ కేసులో నేడు ఈడీ విచారణకు హాజరయ్యాను. విచారణపై అధికారులకు పూర్తిగా సహకరించాను. కొంతమంది అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారు. నిర్దోషిగా ఈ కేసునుండి తప్పక బయటికి వస్తాను' అని తెలియ జేశారు. కాగా హెచ్సీఏకు అజారుద్దీన్ అధ్యక్షునిగా పని చేసిన కాలంలో.. ఉప్పల్ స్టేడియంలో జనరేటర్లు, ఫైర్ ఇంజన్స్, ఇతర సామగ్రి కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు రాగా.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో అజారుద్దీన్ విచారణకు హాజరయ్యారు.  


Similar News