దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ప్లేయర్ అజింక్యా రహానే సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టెస్ట్‌లో అసాధారణ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న రహానే సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రహానే సూపర్ ఫీల్డింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. బంతిని రవీంద్ర జడేజా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. బంతి టర్న్ అవ్వడంతో పాటు అనూహ్యంగా బౌన్స్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ దిశగా దూసుకెళ్లింది. రహానే అంతే వేగంగా రియాక్ట్ అయ్యి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు.
#AjinkyaRahane reminds us of #RahulDravid in the Slips and Forward Short-leg.#INDvsWI #INDvWI #WIvsIND #WIvIND #Cricket #TestCricket #sports #Trinidad #travel #India #WestIndies #indiavsWestIndies
— Bell Buzzer Gong 🍀 (@BellBuzzerGong) July 23, 2023
Video clip courtesy: JioCinema Streaming Live. pic.twitter.com/ciEhxc7Zvt