అధికార పార్టీలో చీలిక!

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో అధికార పార్టీలో చీలిక దిశ వైపు పరిణామాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కుమార్ దహల్ మధ్య గత కొద్ది రోజలు నుంచి సయోధ్య కుదరడంలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా రాయబారి ప్రయత్నించడం గమనార్హం. నేడు జరిగే పార్టీ స్టాండింగ్ కమిటీ […]

Update: 2020-07-10 03:07 GMT

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో అధికార పార్టీలో చీలిక దిశ వైపు పరిణామాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కుమార్ దహల్ మధ్య గత కొద్ది రోజలు నుంచి సయోధ్య కుదరడంలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా రాయబారి ప్రయత్నించడం గమనార్హం. నేడు జరిగే పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం తేలిపోనున్నది.

Tags:    

Similar News