గోడలు ఎక్కేస్తున్న రియల్ ‘స్పైడర్ బాయ్’

దిశ, వెబ్‌డెస్క్: క్షణాల్లో గోడలు ఎక్కేయడం.. చిటికెలో ఓ బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు దూకడం.. పెద్ద పెద్ద భవనాలపై వాటి అద్దాల గోడల మీదుగా అవలీలగా పాకేయడం.. వీటన్నింటినీ ‘స్పైడర్ మ్యాన్’ ఈజీగా చేసేస్తుంటాడు. కాగా, ఆ సూపర్ హీరో స్పైడర్‌మ్యాన్‌ను తెరపై చూసిన ఓ చిట్టి సూపర్ హీరో కూడా ఏ సాయం లేకుండా గోడలు ఎక్కేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి రియల్ స్పైడర్‌ను చూడాలంటే కాన్పూర్ వెళ్లాల్సిందే. బాహుబలి సినిమాలో […]

Update: 2020-09-09 00:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్షణాల్లో గోడలు ఎక్కేయడం.. చిటికెలో ఓ బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ మీదకు దూకడం.. పెద్ద పెద్ద భవనాలపై వాటి అద్దాల గోడల మీదుగా అవలీలగా పాకేయడం.. వీటన్నింటినీ ‘స్పైడర్ మ్యాన్’ ఈజీగా చేసేస్తుంటాడు. కాగా, ఆ సూపర్ హీరో స్పైడర్‌మ్యాన్‌ను తెరపై చూసిన ఓ చిట్టి సూపర్ హీరో కూడా ఏ సాయం లేకుండా గోడలు ఎక్కేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి రియల్ స్పైడర్‌ను చూడాలంటే కాన్పూర్ వెళ్లాల్సిందే.

బాహుబలి సినిమాలో ప్రభాస్ ఓ కొండ ఎక్కడానికి తెగ ప్రయత్నిస్తాడు. కానీ చాలా సార్లు విఫలమవుతుంటాడు. అయినా విశ్రమించకుండా ప్రయత్నించి చివరకు ఎలాగోలా ఎక్కేస్తాడు. అది సినిమా.. ఇక్కడ కాన్పూర్‌కు చెందిన యశ్రాత్ సింగ్ గౌర్‌ కూడా అలానే పట్టు వదలకుండా ప్రయత్నించి ఇప్పుడు ఏ ఆధారం లేకుండా చకచకా గోడలు ఎక్కేస్తున్నాడు. ‘స్పైడర్ మ్యాన్’ సినిమా చూసిన తర్వాత తన ప్రయత్నాలు మొదలుపెట్టిన యశ్రాత్.. మొదట్లో చాలాసార్లు కిందపడ్డాడు. ఆ తర్వాత టెక్నిక్ తెలుసుకుని ప్రాక్టీస్ చేశాడు. ఇక అంతే.. అతనికి ఎదురు లేకుండాపోయింది. మూడో తరగతి చదువుతున్న ఈ ఏడేళ్ల ఈ బుడ్డోడికి.. ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరిక. కాగా, యశ్రాత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మీమ్స్ కూడా వచ్చాయి. ‘అమ్మ కొట్టడానికి వచ్చేస్తే.. వెంటనే ఇలా గోడపైకి ఎక్కేస్తాను, అమ్మ నచ్చని కూర చేసిందంటే పైకి ఎక్కేయడమే, ఫ్లోర్ ఈజ్ విన్నింగ్ ఎలక్షన్స్, స్పైడర్ మ్యాన్ ఇక జాబ్ వదిలేయాల్సిందే’ అంటూ ఫన్నీ మీమ్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

Tags:    

Similar News