నాకు రాజకీయ భిక్ష పెట్టింది వారే: స్పీకర్ తమ్మినేని

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తానే రాజకీయ భిక్ష పెట్టానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందుకు అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టకముందే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎన్టీఆర్ నన్ను పార్టీలోకి ఆహ్వానించడం.. టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టారు. తర్వాత నాకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారు. చంద్రబాబు ఏనాడూ […]

Update: 2021-11-19 05:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తానే రాజకీయ భిక్ష పెట్టానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందుకు అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టకముందే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎన్టీఆర్ నన్ను పార్టీలోకి ఆహ్వానించడం.. టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టారు. తర్వాత నాకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారు. చంద్రబాబు ఏనాడూ నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. మూడు పర్యాయాలుగా రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వైఎస్ జగన్ రాజకీయంగా పునఃభిక్ష పెట్టారు’ అని ఆయన వివరణ ఇచ్చారు.

తనను పార్టీలో ఆహ్వానించగా.. వైఎస్ విజయమ్మ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నా. నాకు రాజకీయంగా భిక్ష పెట్టింది ఒకరు ఎన్టీఆర్..మరోకరు వైఎస్ జగన్ తప్ప చంద్రబాబు కానేకాదు’ అని ఆయన చెప్పారు. ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దంటూ చంద్రబాబుకు హితవు పలికారు.

Tags:    

Similar News