స్పెయిన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్‌‌ ఎత్తివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపించడంతో దాదాపు 2 లక్షల 24 వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 22,902 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు మరణాలు కూడా తగ్గిపోవడంతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం (ఏప్రిల్ 25) నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లి వ్యాయామాలు, వాకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. […]

Update: 2020-04-26 01:59 GMT

దిశ, వెబ్ డెస్క్:

లాక్‌డౌన్‌‌ ఎత్తివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపించడంతో దాదాపు 2 లక్షల 24 వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 22,902 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు మరణాలు కూడా తగ్గిపోవడంతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం (ఏప్రిల్ 25) నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లి వ్యాయామాలు, వాకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. పిల్లలను కూడా బయటకు తీసుకెళ్లే వెసులుబాటును ఇచ్చారు. అయితే పరిమిత దూరం వరకే కుటుంబ సభ్యులు బయటకు నడిచి వెళ్లే అనుమతి ఉంటుందని ప్రకటించారు. ఇక మే 2 నుంచి లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా సడలిస్తామని అన్నారు. కానీ, దేశం మొత్తం ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయమని.. కరోనా కేసుల ప్రభావం చూపించే ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని చెప్పారు. కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రాంతాల వారీగా నిబంధనల సడలింపు ఉంటుందన్నారు. ఒకవేళ కేసులు పెరుగుతున్నట్లైతే మరోసారి పునఃసమీక్ష చేస్తామని చెప్పారు. దేశ స్థానిక పరిస్థితులను బట్టే లాక్‌డౌన్ ఉపసంహరణ కొనసాగుతుందని చెప్పారు. దేశం మొత్తం ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేస్తే తిరిగి కరోనా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు బయటకు వచ్చినా భౌతిక దూరం పాటించడం మరవవద్దని ప్రధాని సాంచెజ్ సూచించారు.

Tags: Spain, Lockdown, Coronavirus, Pedro Sanchez

Tags:    

Similar News