జూనియర్ బఫెట్.. క్వాన్ జూన్

దిశ, ఫీచర్స్ : ‘స్టాక్ మార్కెట్’ ఇది చాలామందికి అర్థంకాని సబ్జెక్ట్. కోటానుకోట్ల రూపాయలు నిమిషంలో ఆవిరైపోతుంటాయి. పదుల సంఖ్యలో ఇన్వెస్టర్స్ క్షణాల్లో కోటిశ్వరులు అయిపోతుంటారు. దీనిపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు మహామహులే తిప్పలు పడుతుంటారు. అలాంటిది దక్షిణకొరియాకు చెందిన ఓ పన్నెండేళ్ల కుర్రాడు మాత్రం ‘స్టాక్ మార్కెట్’లో పెట్టుబడులు పెట్టి, కోట్లాది రూపాయలు గడిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రేడింగ్‌లో ఏకంగా 43 శాతం లాభాలు ఆర్జించి, తన పేరును మారుమోగిస్తున్న ఆ చిచ్చర పిడుగే క్వాన్ […]

Update: 2021-02-12 08:45 GMT

దిశ, ఫీచర్స్ : ‘స్టాక్ మార్కెట్’ ఇది చాలామందికి అర్థంకాని సబ్జెక్ట్. కోటానుకోట్ల రూపాయలు నిమిషంలో ఆవిరైపోతుంటాయి. పదుల సంఖ్యలో ఇన్వెస్టర్స్ క్షణాల్లో కోటిశ్వరులు అయిపోతుంటారు. దీనిపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు మహామహులే తిప్పలు పడుతుంటారు. అలాంటిది దక్షిణకొరియాకు చెందిన ఓ పన్నెండేళ్ల కుర్రాడు మాత్రం ‘స్టాక్ మార్కెట్’లో పెట్టుబడులు పెట్టి, కోట్లాది రూపాయలు గడిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ట్రేడింగ్‌లో ఏకంగా 43 శాతం లాభాలు ఆర్జించి, తన పేరును మారుమోగిస్తున్న ఆ చిచ్చర పిడుగే క్వాన్ జూన్.

ఏడాది క్రితం ‘స్టాక్ మార్కెట్’ గురించి తెలుసుకున్న క్వాన్ జూన్.. గత ఏప్రిల్‌లో సీడ్ మనీగా ‘25 మిలియన్ వోన్’‌తో రిటైల్ ట్రేడింగ్ ఖాతా తెరిచాడు. మదుపర్లు ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఏడాదిలోనే 43 శాతం లాభాలు గడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రతిరోజూ బిజినెస్ వార్తలు చూస్తూ, తన భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఈ చిన్నోడు.. భావి వారెన్ బఫెట్ కావాలని అనుకుంటున్నాడు. వారెన్ బఫెట్ స్ఫూర్తితో స్టాక్ మార్కెట్‌‌లో అడుగుపెట్టిన జూన్.. తనకు రోజువారీ ట్రేడింగ్‌ నచ్చదని, కనీసం 10- 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టి దీర్ఘకాలిక లాభాలు ఆర్జించాలని చూస్తున్నాడు.

పాండమిక్ తర్వాత మైనర్లు, యువతతో పాటు ఉద్యోగం కోల్పోయిన వాళ్లు ఎంతో మంది స్టాక్ మార్కెట్లపై దృష్టిపెడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లలో మైనారిటీ తీరని వారి వాటా క్రమంగా పెరిగిపోతోంది. 214,800 స్టాక్ బ్రోకరేజ్ ఖాతాలలో 70% మంది మైనర్లే కివూమ్ సెక్యూరిటీస్‌లో ఖాతా తెరిచినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు క్వాన్ జూన్ విజయం యువ దక్షిణ కొరియన్లలో ఉపాధి సవాళ్లను కూడా ప్రతిబింబిస్తోంది. జనవరి 2020 నాటికి నలుగురిలో ఒకరికి పనిలో లేకపోవడం ఆ దేశ నిరుద్యోగితను చెప్పకనే చెబుతోంది.

Tags:    

Similar News