కోల్‌కతాలో సఫారీలు
కరోనా వైరస్ మూలంగా ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇండియాకు వచ్చిన సఫారీలు మ్యాచ్ రద్దు కావడంతో స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఐసీసీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల మ్యాచ్‌లు రద్దు చేసుుకుని తమ తమ దేశాలను వెళ్లిపోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇండియాలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లు రద్దైన రోజు లక్నోలో ఉన్న సఫారీలు ఆ రోజు […]
కరోనా వైరస్ మూలంగా ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇండియాకు వచ్చిన సఫారీలు మ్యాచ్ రద్దు కావడంతో స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఐసీసీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల మ్యాచ్‌లు రద్దు చేసుుకుని తమ తమ దేశాలను వెళ్లిపోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇండియాలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లు రద్దైన రోజు లక్నోలో ఉన్న సఫారీలు ఆ రోజు సాయంత్రమే ఢిల్లీ వెళ్లి.. దుబాయి మీదుగా స్వదేశానికి చేరుకుంటారని బీసీసీఐ తెలిపింది. కాగా ఆ రోజు నుంచి దక్షిణాఫ్రికా జట్టు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. తాజాగా సమాచారం మేరకు దక్షిణాఫ్రికా జట్టు కోల్‌కతాలో ఉన్నట్టు తెలుస్తోంది. సిరీస్ రద్దు అయిన వెంటనే లక్నో నుంచి కోల్‌కతా వెళ్లిన జట్టు బీసీసీఐ పర్యవేక్షణలో ఉంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా సఫారీ జట్టు కోల్‌కతాలో ఉన్న విషయాన్ని సీఎం మమత బెనర్జీకి చెప్పారు. దీంతో సీఎం మమత తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఆదివారం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వాలీబాల్ ఆడుతూ కనిపించారు. మంగళవారం కోల్‌కతా నుంచి నేరుగా దుబాయి వెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి చేరుకోనున్నారు.
Tags : South African cricket team, in kolkatha, cm mamatha, india tour, vallybal, bcci,icc