నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే !
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. అయితే దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పర్యాటక జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు పలు ఆంక్షలు విధించింది. దీంతో ఈ పర్యటనలో మేం ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వబోమని సఫారీల కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. ఇండియాలో ‘నమస్తే’ చెప్పే అలవాటు ఉంది కనుక, మేం కూడా అదే కొనసాగిస్తామని అన్నాడు. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావనే అనుకుంటున్నట్లు […]
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. అయితే దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పర్యాటక జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు పలు ఆంక్షలు విధించింది. దీంతో ఈ పర్యటనలో మేం ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వబోమని సఫారీల కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. ఇండియాలో ‘నమస్తే’ చెప్పే అలవాటు ఉంది కనుక, మేం కూడా అదే కొనసాగిస్తామని అన్నాడు. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావనే అనుకుంటున్నట్లు బౌచర్ అభిప్రాయపడ్డాడు.
తమ వెంట సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని, క్రికెటర్ల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ల సూచనలకు కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇండియాలో ఉన్నంత కాలం ఆ నియమాలను పాటిస్తూ.. మా క్రికెటర్లు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని బౌచర్ స్పష్టం చేశాడు.
Tags: IPL, Shake hands, Karona Vairus, Mark Boucher, South Africa