పదేళ్లకే యూట్యూబ్ వేదికగా జీవిత పాఠాలు.. ఎస్‌వోఎస్ ఎన్జీవోకు అంబాసిడర్
దిశ, ఫీచర్స్ : ముంబై వీధుల్లో తిరిగే పదేళ్ల కుర్రాడు చట్‌పట్.. యూట్యూబ్ వేదికగా తన అల్లరి, ఆటపాటలతో పాటు స్నేహితుల గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక జీవిత విశేషాలను పంచుకుంటున్న ఆ కుర్రాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చిన్నవయసులోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చట్ పట్.. ఇటీవలే ‘SOS చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఆ చిచ్చర పిడుగు విశేషాలేంటో మీరూ తెలుసుకోండి. ‘బన్‌తాయ్ అపున్ చట్‌పట్.. […]
దిశ, ఫీచర్స్ : ముంబై వీధుల్లో తిరిగే పదేళ్ల కుర్రాడు చట్‌పట్.. యూట్యూబ్ వేదికగా తన అల్లరి, ఆటపాటలతో పాటు స్నేహితుల గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక జీవిత విశేషాలను పంచుకుంటున్న ఆ కుర్రాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చిన్నవయసులోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చట్ పట్.. ఇటీవలే ‘SOS చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఆ చిచ్చర పిడుగు విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.
‘బన్‌తాయ్ అపున్ చట్‌పట్.. గ్యాన్ దేగా సబ్కో జట్‌పట్.. అబ్‌తక్ తో సమజ్ హై గయే హోగా నా!’ అంటూ ఫాలోవర్స్‌ను పలకరించే ‘చట్ పట్’ తెలివైన మాటలు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందుకే లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో #Chatpatkagyaanకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ‘చిల్డ్రన్స్ డే’ రోజున తొలిసారిగా నెటిజన్ల ముందుకొచ్చిన చట్‌పట్.. ఒక్క వారంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల వీక్షణలతో పాటు 20.5kకు పైగా ఫాలోవర్లను సంపాదించడం విశేషం. కాగా ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అయిన ఎంతో మంది ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబైలో అద్దె రహితంగా జీవించడం ఎలా? పని ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? బాస్ నుంచి ప్రశంసలు ఎలా పొందాలి? వంటి వీడియోలు అన్ని వర్గాలను ఆకర్షించాయి. రోజువారీ జీవితంలో చోటుచేసుకునే సవాళ్ల పరిష్కారానికి ఆ చిన్నోడు తెలివిగా చెప్పే విషయాలు ఆచరణాత్మకమైనవే కాదు, అందరికీ మేల్కొలుపు వంటివి కూడా. ఈ క్రమంలోనే చట్‌పట్ ప్రతిభను గుర్తించిన ఎన్జీవో ‘SOS చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా’ తమ ‘NoChildAlone’ ప్రచారానికి ఇటీవలే తనను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.
చట్‌పట్ పెద్దలకు నచ్చే స్లైస్-ఆఫ్-లైఫ్ కామెంటరీని అందజేస్తాడు. అతడు జీవితసారాన్ని కొంచెం ముందుగానే పట్టుకున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే తను ఇతరులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ గుణమే మాకు బాగా నచ్చింది. అందువల్లే ‘SOS చిల్డ్రన్స్ విలేజెస్’ సేవలందిస్తున్న పేద, అనాథ పిల్లలకు అతను మద్దతును అందించగలడని గ్రహించాం. ఇతర పిల్లలకు ఆదర్శంగా నిలవడంతో పాటు వారిలో మార్పు తెచ్చేందుకు ప్రేరణ కాగలడు.
– సుమంత కర్, SOS చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్