పార్టీలో లోపాలు గుర్తించాలి: సోనియాగాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో లోపాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల్లో అంచనాలను ఎందుకు అందుకోలేకపోయామో తెలుసుకోవాలన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు కమిటీని నియమించాలనుకుంటున్నట్లు సోనియా వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే ‘ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు […]
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో లోపాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల్లో అంచనాలను ఎందుకు అందుకోలేకపోయామో తెలుసుకోవాలన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు కమిటీని నియమించాలనుకుంటున్నట్లు సోనియా వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే ‘ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు జరిగిన అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఆయా రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు పార్టీకి వివరించాలని సోనియా ఆదేశించారు. పార్టీ అంతర్గత ఎన్నికల అంశాన్నీ సోనియా లేవనెత్తారు. నూతన అధ్యక్షుడికి సంబంధించిన అంతర్గత ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సమావేశం ముగిసే సరికి వెల్లడిస్తామని సోనియా తెలిపారు.