అలా అయితే ఇండియా కూటమిని మూసివేయండి: సీఎం ఒమర్ అబ్దుల్లా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియన్ కూటమిని మూసివేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియన్ కూటమిని మూసివేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి(Jammu and Kashmir Chief Minister) ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేశాడు. ఢిల్లీలో AAP, కాంగ్రెస్ పార్టీల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీ కలిసికట్టుగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు పోటీలో నిలుస్తున్నారు. అలాగే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. పార్లమెంట్ వరకే ఇండియా కూటమి పరిమితం అయితే.. దానిని వెంటనే మూసివేయండి అంటూ ఫైర్ అయ్యాడు.
2024 ఎన్నికల తర్వాత ఇండియా కూటమి(India Alliance) భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమి సమావేశం జరగకపోవడం దురదృష్టకరం.. ఎవరు నాయకత్వం వహిస్తారు.. ఎజెండా ఏమిటి? కూటమి ఎలా ముందుకు సాగుతుంది? ఈ అంశాలపై చర్చ జరగలేదు. ఐక్యంగా ఉంటామా అనే దానిపై స్పష్టత లేదని అన్నారు. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి భవిష్యత్తును క్లియర్ చేయడానికి సీఎం అబ్దుల్లా ఓ సమావేశానికి పిలుపునిచ్చారు. ‘ఢిల్లీ ఎన్నికల తర్వాత కూటమిపై సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వాలి.. లోక్‌సభ ఎన్నికల కోసమే అయితే పొత్తుకు స్వస్తి చెప్పాలి.. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొనసాగాలంటే.. మనం కలిసి పని చేయాలి అని ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) చెప్పుకొచ్చారు.