HMPV : హెచ్ఎంపీవీ వైరస్ పై తొలిసారి స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా స్పందించింది.

Update: 2025-01-09 06:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా స్పందించింది. హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం..తీవ్రతలపై కీలక ప్రకటన చేసింది. హెచ్ఎంపీవీ(హ్యూమన్ మెటాప్యూమో వైరస్) కొత్తదేమి కాదని పేర్కొంది. దీనిని 2001లోనే గుర్తించామని డబ్ల్యుహెచ్ వో తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం శీతాకాలంలో పెరుగుతుందని పేర్కొంది. శ్వాసకోశ ఇబ్బంది, సాధారణ జలుబు వంటి లక్షణాలు ఉండవచ్చు అని పేర్కొంది. దీని నివారణకు ఇప్పటికే మందులున్నాయని తెలిపింది. వైరస్ పట్ల అంతగా ప్రజలు భయాందోళన చెందవద్దని..ఇది సాధారణ వైరస్ మాత్రమేనని ప్రకటించింది.

ఇటీవల చైనాలో అనేక హెచ్ఎంపీవీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత ఈ వైరస్ కేసులు భారతదేశంలో కూడా నమోదవ్వడం మొదలైంది. కరోనా వైరస్ అనుభవాల నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల ఆందోళన పెరిగింది. ఈ వైరస్ కూడా కరోనా మాదిరిగా ప్రాణ నష్టం చేస్తుందా అన్న భయాలు రేగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతకుముందు ఆరోగ్య నిపుణులు కూడా హెచ్ఎంపీవీ వైరస్ సాధారణమైందంటూ స్పష్టం చేస్తూ జాగ్రత్తలు, నివారణ చర్యలు సూచించడంతో ప్రజల్లో ఆందోళన క్రమంగా తగ్గుముఖం పట్టింది. హెచ్ఎంపీవీ వైరస్ సాధారమైందని.. ప్రజలు భయాందోళన చెందవద్దని ఇటీవల భారత ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు డబ్ల్యుహెచ్ వో కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.

Tags:    

Similar News