సోనమ్ మెచ్చిన ‘షేర్ గిల్’ చిత్రాలు

బాలీవుడ్ దివా సోనమ్ కపూర్.. లాక్‌డౌన్ పీరియడ్‌లో పుస్తకాలు చదివేందుకు టైమ్ దొరికినందుకు ఆనంద పడింది. ఫ్యామిలీ మొత్తం కూడా పుస్తకాలు చదవడంలో నిమగ్నమైందని తెలుపుతూ ఫొటోలు కూడా షేర్ చేసింది. కాగా, ఇప్పుడు తనకు నచ్చిన కళాకారులను పరిచయం చేస్తానంటూ తొలుత ‘అమృత షేర్ గిల్’ గురించి తెలిపింది. ఆధునిక భారతీయ కళపై తనదైన ముద్రవేసిన మొట్టమొదటి కళాకారిణి ‘షేర్ గిల్’ పెయింటింగ్స్‌లో.. మట్టి రంగుల పాలెట్ వినియోగించడం ప్రత్యేకత అని.. అది తనకు చాలా […]

Update: 2020-07-21 04:00 GMT

బాలీవుడ్ దివా సోనమ్ కపూర్.. లాక్‌డౌన్ పీరియడ్‌లో పుస్తకాలు చదివేందుకు టైమ్ దొరికినందుకు ఆనంద పడింది. ఫ్యామిలీ మొత్తం కూడా పుస్తకాలు చదవడంలో నిమగ్నమైందని తెలుపుతూ ఫొటోలు కూడా షేర్ చేసింది. కాగా, ఇప్పుడు తనకు నచ్చిన కళాకారులను పరిచయం చేస్తానంటూ తొలుత ‘అమృత షేర్ గిల్’ గురించి తెలిపింది.

ఆధునిక భారతీయ కళపై తనదైన ముద్రవేసిన మొట్టమొదటి కళాకారిణి ‘షేర్ గిల్’ పెయింటింగ్స్‌లో.. మట్టి రంగుల పాలెట్ వినియోగించడం ప్రత్యేకత అని.. అది తనకు చాలా నచ్చిందని చెప్పింది సోనమ్. షేర్ గిల్ భారతీయ మహిళ శరీరాన్ని చిత్రీకరించే విధానం తనను ముగ్ధురాలిని చేసిందని.. ఇది చాలా బలమైనది, సాధికారవంతమైనదని తెలిపింది.

‘షేర్ గిల్ పెయింటింగ్స్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు చాలా చిన్న అమ్మాయిని. సమాజంలోని కులీనులను చిత్రీకరించిన సమయంలో అసలైన భారతదేశాన్ని చూపేందుకు తను భయపడలేదు. అభివృద్ధి చెందుతున్న, అసంపూర్ణమైన భారతదేశాన్ని చూపేందుకు ఇష్టపడిన షేర్ గిల్.. అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు’ అని తెలిపింది.

28 ఏళ్లకే కన్నుమూసిన షేర్ గిల్ అద్భుతమైన కళాఖండాలను సృష్టించారని.. భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి ముందు అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారని తెలిపింది సోనమ్. తను గీసిన చిత్రాల్లో ముగ్గురు అమ్మాయిలు, యువకుడి పెయింటింగ్స్ ఇష్టమని షేర్ చేసింది.

Tags:    

Similar News