క్షణాల్లో ఆవిరైన ఆనందం.. తండ్రి ఇంటికొచ్చి కొడుకును కోల్పోయిన కూతురు
దిశ, హుజురాబాద్ రూరల్ : ఆరు బయట ఆడుకుంటున్న పసివాడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. తండ్రి గృహ ప్రవేశానికి వచ్చిన కూతురికి ఆ సంతోషం క్షణకాలం కూడా నిలవలేదు. తల్లి కళ్ళముందే కొడుకు మృత్యు ఒడిలోకి చేరడంతో ఒక్కసారిగా ఆ తల్లి కుప్పకూలిపోయింది. వివరాల్లోకెళితే.. హుజూరాబాద్ మండలం కందుల గ్రామానికి చెందిన ఎండీ అంకుషావాలి గృహ ప్రవేశం కొరకు కూతురు షాయినాజ్ను ఆహ్వానించగా హైదరాబాద్ నుంచి తన భర్త ఫరీద్, కొడుకు ఇమాద్తో కందుగులకు చేరుకుంది. […]
దిశ, హుజురాబాద్ రూరల్ : ఆరు బయట ఆడుకుంటున్న పసివాడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. తండ్రి గృహ ప్రవేశానికి వచ్చిన కూతురికి ఆ సంతోషం క్షణకాలం కూడా నిలవలేదు. తల్లి కళ్ళముందే కొడుకు మృత్యు ఒడిలోకి చేరడంతో ఒక్కసారిగా ఆ తల్లి కుప్పకూలిపోయింది. వివరాల్లోకెళితే.. హుజూరాబాద్ మండలం కందుల గ్రామానికి చెందిన ఎండీ అంకుషావాలి గృహ ప్రవేశం కొరకు కూతురు షాయినాజ్ను ఆహ్వానించగా హైదరాబాద్ నుంచి తన భర్త ఫరీద్, కొడుకు ఇమాద్తో కందుగులకు చేరుకుంది.
ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇమాద్ ఆరు బయట ఆడుకుంటున్న సమయంలో అప్పుడే కారులో బయటికి వెళ్తున్న తండ్రి కారును రివర్స్ తీస్తుండగా పక్కనే ఉన్న గోడకు ఢీ కొట్టింది. అది కాస్త పాతది కావడంతో కూలిపోయింది. గోడ పక్కనే ఆడుకుంటున్న ఇమాద్ పై పాత గోడ శిథిలాలు పడ్డాయి. వెంటనే తేరుకున్న ఫరీద్ కూలిన గోడ ఇటుకలు తొలగించి కొడుకు ఇమాద్ను బయటకు తీశాడు. చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మరణవార్త వినడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు కందుగుల గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది.