ఇలా.. మతిమరుపు మాయం

దిశ, వెబ్ డెస్క్: వృద్ధాప్యంలో జ్ఞాపక‌శక్తిని కోల్పోవడం సహజమే. అదేవిధంగా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. వారిని ఎప్పుడు చూసినా కూడా ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తుంటారు. అయితే.. ఇలాంటివారి కోసం వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో మీరే చూడండి. వృద్ధాప్యంలో ఉన్నవారిలో మతిమరుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారు చాలా తొందరగా అనారోగ్యానికి గురి అవుతూ చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో వారిని ఎప్పుడు చూసినా అలసటగా ఉంటారు. ప్రతిదానికి వారు అసహనానికి గురవుతారు. […]

Update: 2020-04-13 03:20 GMT

దిశ, వెబ్ డెస్క్: వృద్ధాప్యంలో జ్ఞాపక‌శక్తిని కోల్పోవడం సహజమే. అదేవిధంగా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. వారిని ఎప్పుడు చూసినా కూడా ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తుంటారు. అయితే.. ఇలాంటివారి కోసం వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో మీరే చూడండి. వృద్ధాప్యంలో ఉన్నవారిలో మతిమరుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారు చాలా తొందరగా అనారోగ్యానికి గురి అవుతూ చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో వారిని ఎప్పుడు చూసినా అలసటగా ఉంటారు. ప్రతిదానికి వారు అసహనానికి గురవుతారు. అయితే.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. తాము సూచించిన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యలను పారద్రోలే అవకాశముందని చెబుతున్నారు.

అవేమిటంటే.. నారింజ పండ్లు, ఎండుద్రాక్ష, చేపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, వేరుశెనగ, నువ్వులు, కోడిగుడ్లు తీసుకోవాలి. నారింజ పండ్లలో విటమిన్ సి, బి ఉండడం వల్ల మానసిక చురుకుదనం పెరుగుతుంది. మెదడు మొద్దుబారకుండా సహాయపడుతుంది. చేపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, వేరుశెనగ, నువ్వులు, కోడిగుడ్లు తీసుకోవడం వల్ల మీ మెదడును శక్తివంతంగా మెరుగుపరుచుతుందని వారు తెలుపుతున్నారు.

గింజలు, విత్తనాలు తీసుకోవడం వల్ల జ్ఞాపశక్తిని మెరుగుపరుచడంలో సహాయపడుతాయని చెబుతున్నారు. బెర్రీలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ప్రతి రోజూ తీసుకుంటే మతిమరుపు సమస్య రాకుండా దోహదపడతాయి. ఆకు కూరలు తీసుకుంటే చాలా ఉపయోగాలుంటాయి. ఎందుకంటే వాటిలో ఇనుము, విటమిన్ ఇ, కె, బి9(ఫోలేట్), సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాల అభివృద్ధికి చాలా ముఖ్యం. విటమిన్ కె వల్ల మీ మానసిక అప్రమత్తతను పెంచడంలో సహాయపడతాయి. మెదడు కణాలు క్షీణించకుండా పనిచేస్తాయి. కొత్త మెదడు కణాల నిర్వాహణ, ఉత్పత్తిలో సహాయపడుతాయి. తృణధాన్యాలు తీసుకుంటే మీరు బాగా దృష్టి పెట్టడానికి దోహదపడుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూచనలు పాటించి మీకున్న సమస్యలను పారద్రోలండి.

Tags: elderly womens, health tips, Energy, vitamins, food, medical professionals, the elderly

Tags:    

Similar News