జీఎచ్ఎంసీ గ్రీవెన్స్‌కు స్పందన
దిశ, న్యూస్ బ్యూరో : ప్రాపర్టీ టాక్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఆదివారాల్లో నిర్వహించే ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కార గ్రీవెన్స్’కు మంచి స్పందన వస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు గ్రీవెన్స్‌లకు 782 అర్జీలు రాగా అందులో 127అర్జీలను పరిష్కరించినట్టు తెలిపారు. నేడు 348 అర్జీలు రాగా 23అర్జీలను గ్రీవెన్స్ సెల్ కింద పరిష్కరించినట్టు ఆయన వివరించారు. మిగిలిన గ్రీవెన్స్‌ల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాటని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత […]
దిశ, న్యూస్ బ్యూరో :
ప్రాపర్టీ టాక్స్ సమస్యలు పరిష్కరించేందుకు ఆదివారాల్లో నిర్వహించే ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కార గ్రీవెన్స్’కు మంచి స్పందన వస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు గ్రీవెన్స్‌లకు 782 అర్జీలు రాగా అందులో 127అర్జీలను పరిష్కరించినట్టు తెలిపారు. నేడు 348 అర్జీలు రాగా 23అర్జీలను గ్రీవెన్స్ సెల్ కింద పరిష్కరించినట్టు ఆయన వివరించారు. మిగిలిన గ్రీవెన్స్‌ల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాటని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ డిఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు.