సౌరశక్తి ఆధారంగా వెచ్చదనాన్నిచ్చే ‘ఇండియన్ ఆర్మీ టెంట్’
దిశ, ఫీచర్స్: దేశ సంరక్షణ కోసం ఇండియన్ ఆర్మీ ఎముకలు కొరికే చలిలో 24/7 బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తుంటుంది. మైనస్ డిగ్రీ సెల్సియస్‌లో విధులు నిర్వహించే క్రమంలో జవాన్లు తమ షెల్టర్ కోసం అక్కడే టెంట్లు వేసుకుంటారు. అయితే ఈ రకం టెంట్లను ఆర్మీ ఆఫీసర్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్ వాంగ్‌చుక్ అనే లఢఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ అనే ఇంజినీర్.. సైనికుల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త టెంట్‌ను ఆవిష్కరించాడు. […]
దిశ, ఫీచర్స్: దేశ సంరక్షణ కోసం ఇండియన్ ఆర్మీ ఎముకలు కొరికే చలిలో 24/7 బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తుంటుంది. మైనస్ డిగ్రీ సెల్సియస్‌లో విధులు నిర్వహించే క్రమంలో జవాన్లు తమ షెల్టర్ కోసం అక్కడే టెంట్లు వేసుకుంటారు. అయితే ఈ రకం టెంట్లను ఆర్మీ ఆఫీసర్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్ వాంగ్‌చుక్ అనే లఢఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ అనే ఇంజినీర్.. సైనికుల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త టెంట్‌ను ఆవిష్కరించాడు. సౌరశక్తి ఆధారంగా పనిచేసే యూనిక్ సోలార్ హీటెడ్ పవర్ టెంట్.. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో సైతం వెచ్చదనాన్నిస్తూ జవాన్ల రక్షణకు ఉపయోగపడనుంది.
వాంగ్‌చుక్ ఇంతకు ముందు చలి ప్రదేశాల్లోని మట్టిగుడిసెల వాసులకు సౌరశక్తి ద్వారా హీట్ అందించే ప్రాజెక్టును రూపొందించి సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్మీ జవాన్లకు ఉపయోగపడే సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్‌ను తయారుచేశాడు. తను రూపొందించిన టెంట్ ఫొటోలను వాంగ్‌చుక్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు. 30 కిలోల కంటే తక్కువ బరువుండే ఈ టెంట్‌లో 10 మంది జవాన్లు షెల్టర్ తీసుకోవచ్చు. మైనస్ 14 డిగ్రీల సెల్సియస్‌లో టెంట్ సర్వైవ్ అవుతుందని, కార్బన్ న్యూట్రల్‌గా దీనిని రూపొందించినట్లు ఇంజినీర్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. తన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ (HIAL) టీమ్ సభ్యులతో కలిసి వాంగ్‌చుక్ ఈ టెంట్‌ను తయారుచేశారు. కాగా ఈ యూనిక్ సోలార్ హీటెడ్ పవర్ టెంట్.. బయట మైనస్ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, లోపల మాత్రం ప్లస్ 15 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రతను జనరేట్ చేస్తుందని వివరించారు.
WORLD'S FIRST SOLAR HEATED TENT
Thank u all for the overwhelming response to Ladakh's little gift for Indian Army. To answer your Qs about how it works I'm releasing a video at 11am on my YouTube channel. Please share it as an answer to #ClimateChange #MadeInIndia #ILiveSimply pic.twitter.com/xdhgedPoXw— Sonam Wangchuk (@Wangchuk66) February 21, 2021