ఓ పాము.. వీళ్లతో రోడ్డంతా తవ్వించింది

దిశ, కరీంనగర్: కరీంనగర్ లోని కార్ఖానగడ్డలోని ఓ వీధి అది… మద్యాహ్నం ఓ తాచు పాము హల్ చల్ చేసింది. దానిని చూసిన స్థానికులు పాము పాము అని అరిచారు.అంతలోనే అది అదృశ్యం అయింది. చుట్టుపక్కలా వెతికినా ఆ పాము కనిపించలేదు. దీంతో స్థానికులు పాములు పట్టే ఓ యువకునికి సమాచారం ఇచ్చారు. దాదాపు నాలుగు గంటలు శ్రమపడి రోడ్డు పక్కన గుంతలో చొరబడ్డ ఆ పామును ఎట్టకేలకు బయటకు తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. కరీంనగర్ […]

Update: 2020-07-20 21:52 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్ లోని కార్ఖానగడ్డలోని ఓ వీధి అది… మద్యాహ్నం ఓ తాచు పాము హల్ చల్ చేసింది. దానిని చూసిన స్థానికులు పాము పాము అని అరిచారు.అంతలోనే అది అదృశ్యం అయింది. చుట్టుపక్కలా వెతికినా ఆ పాము కనిపించలేదు. దీంతో స్థానికులు పాములు పట్టే ఓ యువకునికి సమాచారం ఇచ్చారు. దాదాపు నాలుగు గంటలు శ్రమపడి రోడ్డు పక్కన గుంతలో చొరబడ్డ ఆ పామును ఎట్టకేలకు బయటకు తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. కరీంనగర్ కార్ఖానగడ్డ అరుంధతీ నగర్ లోని డీసీఎమ్మెఎస్ గోదాముల పరిసరాల్లో సోమవారం మద్యాహ్నం తాచు పాము కనిపించినట్టే కనిపించి అదృశ్యం కావడంతో స్థానికులు ఆందోళన చెందారు. చీకటి పడే సమయంలో బయటకు వచ్చి అది ఎవరినైనా కాటేస్తే ప్రమాదమని గ్రహించిన స్థానికులు తీగలగుట్టపల్లికి చెందిన నందూ అనే పాములు పట్టే యువకునికి సమాచారం ఇచ్చారు. కార్ఖానగడ్డలో పాము సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించిన నందూ సిమెంటు రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి చొరబడిందని గమనించి చెప్పారు. దీంతో పామును బయటకు తీసేందుకు ఎంతసేపు ప్రయత్నించినా బయటకు రాలేదు. చివరకు డ్రిల్లింగ్ మిషన్ తో రోడ్డును తవ్వించి తాచు పాములను బయటకు తీశారు. అర్థరాత్రి వరకూ కాలనీ యువత పామును పట్టుకునే వరకూ పట్టువదలని విక్రమార్కునిలా అక్కడే ఉన్నారు. చివరకు పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకున్న నందును స్థానిక యువత నగదు పారితోషికం ఇచ్చి ఘనంంగా సన్మానించింది.

 

Tags:    

Similar News