అర్ధరాత్రి అక్రమంగా గంజాయి రవాణా.. తప్పించుకున్న స్మగ్లర్లు

దిశ, సారపాక : బూర్గంపాడు మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి సిబ్బందితో ట్రైనీ ఎస్ఐ విజయలక్ష్మీ, కానిస్టేబుల్స్ ప్రసాద్, హోంగార్డులు తిలక్ పతి, కందుల ప్రసాద్, సత్యమూర్తి‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అతివేగంగా రెండు ద్విచక్ర వాహనాలు వెళ్తున్న క్రమంలో వాటిపై ఉన్న బ్యాగులను గమనించారు. వెంటనే వారిని వెంటాడగా వారి వద్ద ఉన్న బ్యాగులను పారవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు వైపు వాహనాలతో పరారైయ్యారు. అట్టి బ్యాగులను తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత […]

Update: 2021-11-16 21:14 GMT

దిశ, సారపాక : బూర్గంపాడు మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి సిబ్బందితో ట్రైనీ ఎస్ఐ విజయలక్ష్మీ, కానిస్టేబుల్స్ ప్రసాద్, హోంగార్డులు తిలక్ పతి, కందుల ప్రసాద్, సత్యమూర్తి‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అతివేగంగా రెండు ద్విచక్ర వాహనాలు వెళ్తున్న క్రమంలో వాటిపై ఉన్న బ్యాగులను గమనించారు. వెంటనే వారిని వెంటాడగా వారి వద్ద ఉన్న బ్యాగులను పారవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు వైపు వాహనాలతో పరారైయ్యారు. అట్టి బ్యాగులను తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత గంజాయి సుమారు 15 కేజీలు ఉండడంతో ఆ బ్యాగులను బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమార్కులను పట్టుకునేందుకు పోలీస్ అధికారులు నిఘా పెట్టారు.

Tags:    

Similar News