సాధారణ స్థాయికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకుందని, ప్రస్తుత డిమాండ్ కరోనా పూర్వ స్థాయికి చేరుకుందని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ చెప్పారు. అయితే, 2021 క్యాలెండర్ ఏడాదిలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 17 కోట్ల యూనిట్లను తాకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2020 క్యాలెండర్ ఏడాదిలో దేశీయ మార్కెట్ సుమారు 15 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. అదేవిధంగా విడిభాగాల సరఫరా సమస్యలు స్థిరంగా ఉన్నాయని, ఉత్పత్తి సైతం […]

Update: 2021-02-05 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకుందని, ప్రస్తుత డిమాండ్ కరోనా పూర్వ స్థాయికి చేరుకుందని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ చెప్పారు. అయితే, 2021 క్యాలెండర్ ఏడాదిలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 17 కోట్ల యూనిట్లను తాకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2020 క్యాలెండర్ ఏడాదిలో దేశీయ మార్కెట్ సుమారు 15 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. అదేవిధంగా విడిభాగాల సరఫరా సమస్యలు స్థిరంగా ఉన్నాయని, ఉత్పత్తి సైతం కరోనా పూర్వ స్థాయి చేరుకుందని ఆయన తెలిపారు.

సాధారణ స్థాయి కంటే 1.5 రెట్లు ఉన్న డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకుంది. డిమాండ్ కరోనా ముందుస్థాయికి చేరుకుంది. గతేడాది కొనుగోలు చేసిన విధానంలో కాకుండా, ప్రస్తుత వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, స్పెసిఫికేషన్‌లను చూసి తీసుకుంటున్నారు. అలాగే, కాంపొనెంట్ సరఫారా పరిస్థితులు కూడా సాధారణమయ్యాయని మాధవ్ శేత్ వివరించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన భాగాలపై సుంకం పెంచేందుకు కంపెనీ యోచిస్తోందని, అయితే ఇది ఎక్కువేమీ కాదని ఆయన వివరించారు.

Tags:    

Similar News