Honda SP125 Bike: రూ.91,771 ప్రారంభ ధరతో హోండా కొత్త బైక్ లాంచ్.. ఫీచర్ల వివరాలివే..!
జపాన్(Japan)కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా(Honda) ఇండియాలో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడనికి ప్రయత్నాలను వేగవంతం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా(Honda) ఇండియాలో తన మార్కెట్ ను మరింత పెంచుకోవడనికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఎప్పటికప్పడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూ కస్టమర్లను(Customers) ఆకట్టుకుంటోంది. ఇటీవలే తన పాపులర్ స్కూటర్ మోడల్ యాక్టివా(Activa) న్యూ వర్షన్ ను లాంచ్ చేసిన ఆ సంస్థ తాజాగా బైక్ సెగ్మెంట్‌లో కొత్త 125సీసీ ను తీసుకొచ్చింది. హోండా ఎస్‌పీ125(Honda SP125)బైక్ పేరుతో దీన్ని దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. డ్రమ్(Drum), డిస్క్(Disk) వేరియంట్లలో ఈ టూవీలర్ బైకును లాంచ్ చేసింది. డ్రమ్ వేరియంట్ ధర రూ. 91,771(Ex-Showroom)గా ఉండగా.. వేరియంట్ ధర రూ.1,00,284గా ఉన్నాయి.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. దీన్ని 124cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో తీసుకొచ్చారు. ఇది 10.7 bhp పవర్, 10.90 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో పాటు 11.2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. ఇక మైలేజ్ పరంగా చూస్తే లీటర్‌కు దాదాపు 65 కి.మీల ఇస్తుందని కంపెనీ తెలిపింది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ స్ప్రింగ్‌లను అమర్చారు. అలాగే 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రన్ అవుతుంది. LED హెడ్‌ల్యాంప్ , టెయిల్‌ల్యాంప్ కలిగి ఉంది. ఇక బ్లూటూత్ కనెక్టివిటీ, 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే, నావిగేషన్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, వాయిస్ అసిస్ట్ ఫీచర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్,పెరల్ సైరన్ బ్లూ, మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే ఐదు కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.