Akasa Air: ఆకాసా ఎయిర్‌కు రూ.10 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ

ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, బాధిత ప్యాసింజర్లకు ఆకాసా ఎయిర్ పరిహారం ఇవ్వలేదు

Update: 2024-12-24 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ. 10 లక్షల జరిమానా విధించింది. ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించడమే కాకుండా, వారికి అవసరమైన పరిహారం కూడా చెల్లించని కారణంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న బెంగళూరు-పూణె విమాన ప్రయాణం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన రోజున ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ కారణంగా విమానం గ్రౌండింగ్ అయిన తర్వాత ఫ్లైట్ ఆలస్యమైంది. ఆ తర్వాత తొమ్మిది సీట్లు దెబ్బతిన్న విమానం అందుబాటులో ఉండటంతో ఏడుగురు ప్రయాణీకులు విమాన ఎక్కలేకపోయారు. అయితే ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, బాధిత ప్యాసింజర్లకు ఆకాసా ఎయిర్ పరిహారం ఇవ్వలేదు. ఇది డీజీసీఏ పౌర విమానయాన అవసరాల సెక్షన్ల ప్రకారం ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ వ్యవహారంలోనే తాజాగా డీజీసీఏ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆకాసా ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ.. డీజీసీఏ ఆర్డర్‌ను అంగీకరిస్తూనే, దీని పరిష్కారానికి ప్రోటోకాల్ మెరుగుదల కోసం సహకరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనతో ఆకాసా ఎయిర్ మరోసారి నియంత్రణ సంస్థ నుంచి నోటీసులు అందుకుంది. గత వారంలోనే కంపెనీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, సర్టిఫికేట్ లోపాల కారణంగా ఆకాసా ఎయిర్ నోటీసులను అందుకుంది. 

Tags:    

Similar News