సఫారీ జట్టులో ఇద్దరికి కరోనా

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా జట్టును కరోనా కలవరపెడుతున్నది. త్వరలో ఇంగ్లాండ్ జట్టుతో సుదీర్ఘమైన సిరీస్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతుండటంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఒక ఆటగాడికి కరోనా సోకడంతో అతడితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఐసోలేషన్‌లో ఉన్న మిగతా ఇద్దరు క్రికెటర్లకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. […]

Update: 2020-11-21 08:24 GMT

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా జట్టును కరోనా కలవరపెడుతున్నది. త్వరలో ఇంగ్లాండ్ జట్టుతో సుదీర్ఘమైన సిరీస్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతుండటంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఒక ఆటగాడికి కరోనా సోకడంతో అతడితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఐసోలేషన్‌లో ఉన్న మిగతా ఇద్దరు క్రికెటర్లకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

దీంతో శనివారం దక్షిణాఫ్రికా జట్టు ఆడాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే కరోనా సోకిన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరనే విషయాన్ని మాత్రం దక్షిణాఫ్రికా బోర్డు గోప్యంగా ఉంచింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు ఆటగాళ్లకు బోర్డు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నది. అంతే కాకుండా వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ మానసిక ధైర్యాన్ని ఇస్తున్నది. దక్షిణాఫ్రికా మెడికల్ టీమ్ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నదని.. సిరీస్‌లో పారదర్శకత కోసమే కేసుల విషయం బయటకు వెల్లడిస్తున్నామని దక్షిణాఫ్రికా బోర్డు వెల్లడించింది. కాగా, నవంబర్ 27 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News