ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్‌కు వెళ్లేది ఇలాగే!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘దళిత బంధు’ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ మండలం పరిధిలోని శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఈ పథక ఆవిష్కరణకు సీఎం కేసీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌తో పలువురితో విమానంలో వెళ్లేట్లుగా ప్లాన్ చేశారు. అయితే, ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గం గుండా వెళ్లనున్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘దళిత బంధు’ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ మండలం పరిధిలోని శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఈ పథక ఆవిష్కరణకు సీఎం కేసీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌తో పలువురితో విమానంలో వెళ్లేట్లుగా ప్లాన్ చేశారు. అయితే, ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గం గుండా వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి, అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా తన కారులో వెళ్లనున్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఒకే వాహనంలో తరలివెళ్లారు.
మీరు కాకుండా మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దళిత బంధు పథకానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు హాజరు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ పర్యటన అడ్డుకుంటామని ప్రతిపక్ష పార్టీలు పేర్కొనడంతో ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు చెందిన పదవులను నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలు విద్యార్థి సంఘాల నేతలను కూడా అరెస్టు చేశారు.