Minister S. Jaishankar: భారత ప్రభుత్వంపై దుష్ప్రచారం
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ మిషన్‌పై అమెరికాలో పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత దేశ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రించే రాజకీయ ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయని అన్నారు. ఆ కట్టుకథలకు వాస్తవంలో ప్రభుత్వ పాలనకు పొంతన లేదని తెలిపారు. యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జనరల్ హెచ్ఆర్ మెక్‌మాస్టర్‌తో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశం కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, సంక్షోభ సమయంలో ఉన్నదని వివరించారు. తమ ప్రభుత్వ పాలనలో పక్షపాతం […]
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ మిషన్‌పై అమెరికాలో పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత దేశ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రించే రాజకీయ ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయని అన్నారు. ఆ కట్టుకథలకు వాస్తవంలో ప్రభుత్వ పాలనకు పొంతన లేదని తెలిపారు. యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జనరల్ హెచ్ఆర్ మెక్‌మాస్టర్‌తో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశం కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, సంక్షోభ సమయంలో ఉన్నదని వివరించారు.
తమ ప్రభుత్వ పాలనలో పక్షపాతం లేదని చెప్పారు. గతేడాది కనీసం 80 కోట్ల మందికి ఉచిత ఆహారధాన్యాలు అందించామని, ప్రస్తుతమూ మళ్లీ అందిస్తున్నామని, కనీసం 40 కోట్ల మందికి నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. తమ ప్రభుత్వ పథకాల్లో వివక్ష లేదని, ప్రజలందరిపట్ల సమంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాలు చేశాయని చెప్పారు.