విషాదం : కుటుంబానికి శాపంగా మారిన వర్షం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం ఐదుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం, కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హరిజన మోషె (35), శాంతమ్మ(30) దంపతులు తమ పిల్లలు చరణ్(12), తేజ(9) రాము(7), చిన్న, స్నేహతో కలిసి ఎప్పటిలాగే తమ గుడిసెలో నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గోడకూలి వారి మీద పడడంతో వారు మట్టిలో […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం ఐదుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం, కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హరిజన మోషె (35), శాంతమ్మ(30) దంపతులు తమ పిల్లలు చరణ్(12), తేజ(9) రాము(7), చిన్న, స్నేహతో కలిసి ఎప్పటిలాగే తమ గుడిసెలో నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గోడకూలి వారి మీద పడడంతో వారు మట్టిలో కలిసిపోయి చిన్న, స్నేహ మినహా మిగిలిన ఐదుగురు ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన చిన్న, స్నేహలను స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. నిన్నటి దాకా తమతో ఉన్న కుటుంబం సజీవ సమాధి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి