బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వండి.. సీతక్క విజ్ఞప్తి

దిశ, మహబూబాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు గిరి వికాసం పథకం అమలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సితక్క మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ను కోరారు. ఆదివారం ఆమె కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారాం మండలాల్లో గిరి వికాసం పథకంలో భాగంగా బోర్లు వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన […]

Update: 2021-05-31 06:17 GMT

దిశ, మహబూబాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు గిరి వికాసం పథకం అమలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సితక్క మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ను కోరారు. ఆదివారం ఆమె కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారాం మండలాల్లో గిరి వికాసం పథకంలో భాగంగా బోర్లు వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

Tags:    

Similar News