హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయండి.. సీతక్క సూచన

దిశ, ములుగు: జిల్లాలో మలేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన గ్రామాలలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. బుధవారం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మలేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో మలేరియా టెస్ట్ లు చేయాలని, వైద్య సిబ్బంది గ్రామాలలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలని సూచించారు. […]

Update: 2021-07-14 08:32 GMT

దిశ, ములుగు: జిల్లాలో మలేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన గ్రామాలలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. బుధవారం జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మలేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో మలేరియా టెస్ట్ లు చేయాలని, వైద్య సిబ్బంది గ్రామాలలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలని సూచించారు.

గత ఏడాది నుంచి కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజలు ఇప్పుడు మలేరియా జబ్బు వలన ఇబ్బందులు పడుతున్నారని, ములుగు జిల్లాలో మలేరియా తీవ్రత వలన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ద ప్రాతిపదికన మారుమూల గ్రామాలలో, తండాలలో, గుడాలలో వైద్య సిబ్బంది పర్యటించి హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలని కోరారు. గ్రామాలలో దోమల బెడద లేకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Tags:    

Similar News