ముగిసిన సింగరేణి కార్మికుల సమ్మె.. యాజమన్యానికి నష్టమెంతో తెలుసా?
దిశ, భూపాలపల్లి: నాలుగు బొగ్గు బావులను ప్రవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేస్తున్న దేశవ్యాప్త సమ్మె నేటితో ముగిసింది. మూడు రోజులపాటు సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. భూపాలపల్లి సింగరేణి పరిధిలో 5600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. బొగ్గు బావులు నిర్మానుషంగా ఉండిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె మూలన […]
దిశ, భూపాలపల్లి: నాలుగు బొగ్గు బావులను ప్రవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేస్తున్న దేశవ్యాప్త సమ్మె నేటితో ముగిసింది. మూడు రోజులపాటు సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. భూపాలపల్లి సింగరేణి పరిధిలో 5600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. బొగ్గు బావులు నిర్మానుషంగా ఉండిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికుల సమ్మె మూలన సింగరేణిలోని భూపాలపల్లి ఏరియాలో రూ. 150 కోట్లకు పైగా నష్టం సంభవించింది. మూడు రోజులలో 63 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి కార్మికులకు శాసన సభ్యులు శ్రీధర్ బాబుతోపాటు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలుపుతూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణిలోని 4 బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేదిలేదని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు అన్ని సంఘాల వారు మద్దతు తెలపడంతో సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు మద్దతుగా శనివారం రోజు భూపాలపల్లి పట్టణంలోని వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి.