‘సింగరేణి ’ నన్ను మోసం చేసింది.. సెల్ టవర్ ఎక్కిన బాధితుడు
దిశ ,ఇల్లందు: ఇల్లందు పట్టణానికి చెందిన సుందర్ అనే వ్యక్తి సింగరేణి ఓసీలో తన భూమిని కోల్పోయానని దానికి తగిన పరిష్కారం ఇంతవరకు చూపించలేదని బాధతో సింగరేణి అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగిన పట్టించుకోవడంలేదని ఆవేదన తో గోవింద్ సెంటర్ లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి ,సీఐ బరపటి రమేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గుమిగూడిన జనాలను చెదరగొట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. సంఘటనా […]
దిశ ,ఇల్లందు: ఇల్లందు పట్టణానికి చెందిన సుందర్ అనే వ్యక్తి సింగరేణి ఓసీలో తన భూమిని కోల్పోయానని దానికి తగిన పరిష్కారం ఇంతవరకు చూపించలేదని బాధతో సింగరేణి అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగిన పట్టించుకోవడంలేదని ఆవేదన తో గోవింద్ సెంటర్ లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి ,సీఐ బరపటి రమేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గుమిగూడిన జనాలను చెదరగొట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. సంఘటనా స్థలానికి ఆర్డీఓ స్వర్ణలత ,సింగరేణి జీఎం మల్లెల సుబ్బారావు చేరుకొని బాధితునికి తన వద్ద ఉన్న కాగితాలను తీసుకుని సోమవారం ఆర్డీవో కార్యాలయానికి రావాలని ఆర్డీఓ సూచించారు. ఆర్డీవో హామీతో సుందర్ సెల్ టవర్ దిగాడు.