బగ్ కనిపెడితే.. 5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ
దిశ, ఫీచర్స్ : యాప్స్, వెబ్‌సైట్స్‌లోని చిన్నపాటి ఎర్రర్స్(లోపాల) వల్ల ఆయా కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు లేదా విలువైన సమాచారం నష్టపోయే అవకాశముంటుంది. అందువల్లే ‘బగ్ బంటీ’ ప్రొగ్రామ్స్ పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఎర్రర్స్ గుర్తించిన వారికి లక్షల రూపాయలు బహుమానంగా అందిస్తాయి. అయితే సింగపూర్ ప్రభుత్వానికి చెందిన Govt Tech (ప్రభుత్వ టెక్నాలజీ ఏజెన్సీ) గత వారం కొత్త బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, లోపాన్ని కనిపెడితే 5 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ […]
దిశ, ఫీచర్స్ : యాప్స్, వెబ్‌సైట్స్‌లోని చిన్నపాటి ఎర్రర్స్(లోపాల) వల్ల ఆయా కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు లేదా విలువైన సమాచారం నష్టపోయే అవకాశముంటుంది. అందువల్లే ‘బగ్ బంటీ’ ప్రొగ్రామ్స్ పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఎర్రర్స్ గుర్తించిన వారికి లక్షల రూపాయలు బహుమానంగా అందిస్తాయి. అయితే సింగపూర్ ప్రభుత్వానికి చెందిన Govt Tech (ప్రభుత్వ టెక్నాలజీ ఏజెన్సీ) గత వారం కొత్త బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, లోపాన్ని కనిపెడితే 5 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ అందించనుంది.
బగ్‌బంటీ ప్రొగ్రామ్ కోసం సింగపూర్ Govt Tech హ్యాకర్‌వన్‌తో భాగస్వామ్యమైంది. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే ఎథికల్ హ్యాకర్స్, ఔత్సాహికులు ప్లాట్‌ఫామ్‌లో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా హ్యాకర్ వన్ తెలిపింది. ప్రభుత్వ వెబ్‌సైట్స్‌లోని భద్రతపరమైన లోపాలను గుర్తించేందుకు సింగపూర్ ప్రభుత్వం గతంలోనూ బగ్‌బౌంటీ ప్రోగ్రామ్స్ నిర్వహించగా, తన ఐటీ వ్యవస్థలలోని లోపాలను వెలికితీసే ప్రయత్నాలను విస్తరించింది. బగ్ బౌంటీలు ప్రజాదరణ పొందగా, ఫేస్‌బుక్, గూగుల్, ఆపిల్, పెంటగాన్ వంటి కంపెనీలు తమ సైట్‌లను భద్రపరచడానికి నిర్వహించే బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తున్నాయి.